Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
Vishvajit More : భారత యువ రెజ్లర్ విశ్వజిత్ మోరె (Vishvajit More) చరిత్ర సృష్టించాడు. అండర్-23 గ్రీకో రోమన్(Greco- Roman) విభాగంలో రజతం గెలిచిన వీరుడిగా రికార్డు నెలకొల్పాడు.
Vishvajit More : భారత యువ రెజ్లర్ విశ్వజిత్ మోరె (Vishvajit More) చరిత్ర సృష్టించాడు. అండర్-23 గ్రీకో రోమన్(Greco- Roman) విభాగంలో రజతం గెలిచిన వీరుడిగా రికార్డు నెలకొల్పాడు. పురుషుల 55 కిలోల విభాగంలో గురువారం ఒక్క పాయింట్ తేడాతో స్వర్ణం చేజార్చుకున్నాడతడు. హోరాహోరీగా సాగిన పోరులో జార్జియాకు చెందిన కొబ కరుమిడ్జే చేతిలో మోరె ఓడిపోయాడు. పసిడి కల చెదిరినా.. ఈ విభాగంలో రెండో స్థానంలో నిలిచిన భారత కుస్తీ చిన్నోడిగా అవతరించాడతడు.
కుస్తీ ఆటలో విశ్వ వేదికపై మరో భారత కుర్రాడు మెరిశాడు. అమెరికాలోని లాస్ వేగాస్‌లో జరుగుతున్న అండర్-23 వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో అదిరే పట్టుతో అదరగొట్టిన విశ్వజిత్ మోరె వెండి వెలుగులు విరజిమ్మాడు. గ్రీకో రోమన్ పురుషుల 55 కిలోల విభాగంలో సత్తా చాటిన అతడు.. ఫైనల్లో మాత్రం తడబడ్డారు.
🥈 SILVER FOR VISHVAJIT MORE! 🇮🇳🤼
Vishvajit More falls agonisingly short of gold, losing to Georgia’s Koba Karumidze in the U23 World Championships 55kg Greco-Roman final.
A valiant fight till the final second! 🇮🇳👏
#Wrestling #U23WorldChampionships #VishvajitMore #IndiaSportsHub
— IndiaSportsHub (@IndiaSportsHub) October 15, 2026
ఆద్యంతం ఉత్కంఠ రేపిన పసిడి పోరులో కొబ కరుమిడ్జే(జార్జియా)కు గట్టిపోటీనిచ్చిన మోరె ఒక్క పాయింట్ తేడాతో ఓడాడు. మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శిన భారత కుర్రాడు 12-13తో వెనకబడి సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకున్నాడు. అయినా సరే అండర్-23 వరల్డ్ ఛాంపియన్షిప్స్ గ్రీకో రోమన్ విభాగంలో ఫైనల్ ఆడిన తొలి ఇండియన్ రెజ్లర్‌గా మోరె చరిత్ర లిఖించాడు. ఇదే పోటీల్లో.. చేతన్ (63 కిలోలు), కరణ్ కంబోజ్ (87 కిలోలు) పతక పోరుకు అర్హత సాధించలేదు. అయితే.. మహిళల విభాగంలో కోమల్, దీక్షా మాలిక్(68 కిలోలు)లు కాంస్యం పతకం కోసం బరిలోకి దిగనునున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

