‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
కోదాడ నియోజకవర్గంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోతున్న పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని, నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గురువారం జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ వినతి పత్రం అందజేశారు. అనంతరం...
– కలెక్టర్కు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వినతి
కోదాడ, అక్టోబర్ 15ర : కోదాడ నియోజకవర్గంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోతున్న పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని, నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గురువారం జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ వినతి పత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం తీవ్ర కష్టాలు పడుతున్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం ముందుస్తు జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువేనని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతులు ఎన్నో ఆశలతో పెట్టుబడులు పెట్టి, అప్పుల పాలై పంటలు సాగు చేస్తే, అవి కళ్లెదుటే ఎండిపోతుంటే గుండెలు అవిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అప్పులు చేసి మరీ నీళ్ల ట్యాంకర్లు, జనరేటర్లు తెచ్చుకుని పంటలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నప్పటికీ ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేయడం లేదన్నారు.
ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా రైతుబంధు, రైతు భరోసా, రుణమాఫీ వంటి హామీలు ఏవీ పూర్తిస్థాయిలో అమలు కాకపోవటం శోచనీయమన్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు లేక ఉపాధి కోల్పోయిన కూలీలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఏడాదికి 12 వేల రూపాయలు ఇస్తామన్న హామీ కూడా గాలికి కొట్టుకుపోయిందని మండిపడ్డారు… ప్రభుత్వం రైతుల ప్రాణాలు గాలికి వదిలేసి, విలాసాల కోసం, విదేశీ పర్యటనలు, ఫుట్ బాల్ బ్యాచుల కోసం కోట్లు తగలేస్తున్నారని విమర్శించారు. ఆ వృథా ఖర్చులను తగ్గించుకుని, ఇబ్బందుల్లో ఉన్న రైతులను, వ్యవసాయ కూలీలను ఆదుకోవాలన్నారు. ప్రధానంగా కోదాడ నియోజకవర్గంలోని కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆరు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి, పారదర్శకంగా పంట నష్టంపై సమగ్ర అంచనా వేసి ఎండిపోయిన పంటలకు తక్షణమే నష్టపరిహారం ప్రకటించి, అప్పుల పాలైన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. వ్యవసాయ పనులు లేక పూటగడవని పరిస్థితుల్లో ఉన్న రైతు కూలీలకు కరువు భత్యం లేదా ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక సహాయాన్ని తక్షణమే అందించాలన్నారు. రైతాంగానికి, కూలీలకు భరోసా కల్పించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు శీలం సైదులు, ఏలుగూరి వెంకటేశ్వరరావు, ఆంజనేయులు, జానకి రామాచారి, తాళ్లూరు శ్రీనివాస్, భూపాల్ రెడ్డి, కిరణ్ కుమార్, ఉపేందర్, శ్రీనివాస్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్షిప్స్లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

