రైతుల పొలాలను ముంచెత్తిన వరద
మహబూబ్‌నగర్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నాసిరకం నిర్మాణం వల్ల చిన్నపాటి వరదకే చెక్ డ్యామ్ సైడ్ వాల్ కోతకు గురై రైతుల పొలాలను ముంచెత్తిన ఘటనపై కాంగ్రెస్ పార్టీ రాజకీయం చే స్తోంది. తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అధికారులను పావులుగా వాడుకుంటున్నారు. ఈ చెక్ డాం కింద కొట్టుకుపోయిన రైతుల పంట పొలాలకు నష్టపరిహారం అందిస్తామని బుకాయిస్తున్నారు. చివరకు కాంగ్రెస్ నేతలంతా ఒత్తిడి తీసుకువచ్చి ఇది కొట్టుకోపోలేదని.. చెబుతున్నారు. అడ్డాకుల మండలం రాచర్ల గుడిబండ చెక్‌డ్యాంను బుధవారం ఇరిగేషన్ ఈఈ, తాసీల్దార్లు సందర్శించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే అనుచరులు పంట పొలాలను ముంచెత్తిన రైతులను మీ కు నష్టపరిహారం ఇప్పిస్తాం జరిగిన విషయం మీడి యాకు చెప్పకండి అంటూ సొంత స్క్రిప్ట్ రాశారు. దీంతో రూ.4.6 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చెక్ డ్యాంపై విచారణ జరపాల్సిన అధికారులు.. తప్పులు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ.. కాంగ్రెస్ ఇచ్చిన స్క్రిప్ట్‌ను మీడియా ముందు చదివి వినిపించడం కనిపించింది. గత ఏడాది మార్చి, ఏప్రిల్‌లో ఈ చెక్ డ్యామ్‌కు అంకు రార్పణ చేసిన కాంగ్రెస్ సర్కార్ నాసిరకంగా నిర్మించి చేతులు దులుపుకున్నారు.
చివరకు ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు వాగు పొంగడంతో అసలు స్వరూపం బయటపడింది. ఈ చెక్ డ్యాం కింద సాగు చేసుకుంటున్నా రైతుల పొలాలను ముంచెత్తింది. ఈ వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’లో గత రెండు మూడు రోజులుగా వస్తున్న కథనాలకు స్పం దించి చివరకు రైతులను ఆదుకుంటామని అధికా రుల తో చెప్పించారు. మాకు వ్యతిరేకంగా చెబితే ఒక్క రూపా యి కూడా రాకుండా చేస్తామని సమీప రైతులను బెదిరి స్తున్నట్లు సమాచారం. మొత్తంపైన కాంగ్రెస్ నేతలు తప్పులు కప్పిపుచ్చుకునేందుకు చెక్‌డ్యాంపై ఉల్టా విమ ర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా అధికా రులు ఈ వ్య వహారంపై సమగ్ర విచారణ చేపట్టి రైతుల కు నష్టప రిహారం అందించి.. చెక్ డ్యాం .. కొట్టుకు పోయిన కట్టను మరమ్మతులు చేయించాలని, కాంట్రా క్టర్‌పై చర్యలు తీసుకోవాల ని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.