మహదేవ్పూర్,సెప్టెంబర్ 16 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్‌కు వరద నీరు భారీగా వస్తోంది. ఎగువన ఉన్న మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా బరాజ్‌కు వరద పెరుగుతోంది. మంగళవారం 94,640 క్యూసెక్కుల ప్రవాహం రాగా, బుధవారం 1,08,500 క్యూసెక్కులకు పెరిగింది.
మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బరాజ్ గరిష్ట నీటి ప్రవాహం ఎత్తు రివర్ బెడ్ నుండి సముద్ర మట్టానికి 100 మీటర్లు కాగా, ప్రస్తుతం90.50 మీటర్ల ఎత్తులో ఉందని భారీ నీటిపారుదలశాఖ ఈఈ సురేశ్ తెలిపారు.