Flipkart : ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Big Saving Days sale) తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ కొనసాగనుంది. సేల్‌లో భాగంగా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు తదితర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్షిప్ యూజర్లు ఒక రోజు ముందుగానే అంటే మే 2 నుంచే ఈ సేల్‌లో పాల్గొనవచ్చని ప్రకటించింది.
అదేవిధంగా బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా ఎస్బీఐ కార్డు ద్వారా చేసే కొనుగోళ్లపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తన వెబ్సైట్లో పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఆప్షన్ ద్వారా లక్ష రూపాయల వరకు కొనుగోలు చేయొచ్చని, వీటిపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంటుందని ప్రకటించింది.
అంతేగాక ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్ అందించనున్నట్లు తెలిపింది. యూపీఐ లావాదేవీలపై కూడా తగ్గింపు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. అయితే కంపెనీ ఆఫర్లను వివరంగా రివీల్ చేయలేదు. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన స్మార్ట్ఫోన్లపై భారీ ఎత్తున డిస్కౌంట్లు అందిచనున్నట్లు సమాచారం.