Flipkart Big Saving Days sale : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ సమ్మర్ డే సేల్‌ను లాంఛ్ చేసిన కొద్దిరోజుల అనంతరం బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. మే 3 నుంచి ప్రారంభం కానున్న ఈ సేల్కు సంబంధించి కొన్ని డీల్స్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. మే 3 నుంచి మే 9 వరకూ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ కొనసాగుతుంది. ఇక అమెజాన్ సేల్ మే 2 నుంచి ప్రారంభం కానుండటం విశేషం.
ఇక ఫ్లిప్‌కార్ట్ సేల్ లిస్టింగ్ ప్రకారం మోటొరొలా ఎడ్జ్ 50 ప్రొ సేల్‌లో రూ. 27999 వద్ద డిస్కౌంట్ ధరకు లిస్ట్ కానుంది. మోటొ ఎడ్జ్ 40 నియో రూ. 19,999కే అందుబాటులో ఉండనుండగా మోటో జీ64 రూ. 12,999 మోటో జీ34 రూ. 9999కి సేల్‌లో అందుబాటులో ఉండనున్నాయి. పోకో ఎం6 రూ.7999కే ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో లభించనుంది. పోకో ఎక్స్6ప్రొ, పోకో ఎం6 ప్రొ, వివో టీ3 వంటి పలు హాట్ డివైజ్‌లు సేల్‌లో ఆకర్షణీయ ధరల్లో అందుబాటులో ఉండనున్నాయి.
పోకో ఎక్స్6, ఐఫోన్ 12 సేల్‌లో వరుసగా రూ. 17,999. రూ.39,499కి లభించనున్నాయి. ఇక పిక్సెల్ 7ఏ పలు ఆఫర్లతో రూ. 31,999కి, పిక్సెల్ 8 రూ. 49,999కే ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో అందుబాటులో ఉంటాయి. ఇక సేల్ ఈవెంట్‌కు ముందు నథింగ్ ఫోన్ 2ఏ, పోకో ఎక్స్6 ప్రొ, ఐఫోన్ 14 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ, వివో టీ2 ప్రొ వంటి ప్రముఖ డివైజ్‌లపై మెగా ప్రైస్ డ్రాప్ ఆఫర్ చేయనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది.
Read More :
Jr NTR | అభిమాని బర్త్ డే.. ఫుల్ ఖుషీ చేసిన తారక్.. ట్రెండింగ్‌లో విజువల్స్