చెన్నై, మే 14: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్..మార్కెట్లోకి ఒకేసారి మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐక్యూబ్ పోర్ట్‌ఫోలియో వీటిని ప్రవేశపెట్టింది. ఈ బైకు ప్రారంభ ధర రూ.94,999గా నిర్ణయించింది. జూన్ 30వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ ధరలు చెన్నై షోరూంనకు సంబంధించినవి. 2.2 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్ గంటకు 75 కిలోమీటర్ల వేగంతో 75 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.
అలాగే 3.4 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్ 100 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. గంటకు 78 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ మాడల్‌ను రూ.1,55,555కి విక్రయించనున్నది. 5.1 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్ సింగిల్ చార్జింగ్‌తో 150 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. 118 కి పైగా ఫీచర్స్ కలిగిన ఈ స్కూటర్ 4.18 గంటల్లో 80 శాతం వరకు బ్యాటరీ రీచార్చికానున్నది. గంటకు 82 కిలోమీటర్ల వేగం కలిగిన ఈ మాడల్ ధర రూ.1,85,373గా నిర్ణయించింది.