ఎఫ్ఐఐల్లో టెన్షన్..టెన్షన్
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకున్నది. సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ సర్కార్కు మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని అంచనాలు వెల్లడికావడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్ఐఐలు భారీ స్థాయిలో తమ పెట్టుబడులను తరలించుకుపోతున్నారు.
- 4 వేల కోట్ల షేర్లను అమ్మేసిన విదేశీ మదుపరులు
ముంబై, మే 14: విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకున్నది. సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ సర్కార్కు మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని అంచనాలు వెల్లడికావడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్ఐఐలు భారీ స్థాయిలో తమ పెట్టుబడులను తరలించుకుపోతున్నారు. తాజాగా మంగళవారం రూ.4 వేల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఎక్సేంజ్ల వద్ద ఉన్న సమాచారం ఆధారంగా రూ.9,988. 34 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసిన ఎఫ్ఐఐలు.. రూ.14,054 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. నికరంగా రూ. 4,065.66 కోట్ల నిధులను వెనక్కి తీసుకున్నారు. మొత్తంగా ఈ ఏడాది ఎఫ్ఐఐలు రూ.1,17,788 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.
డీఐఐల జోరు
ఒకవైపు ఎఫ్ఐఐలు అమ్మకాలకు మొగ్గుచూపితే.. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు మాత్రం ఈక్విటీ మార్కెట్లలోకి నిధులు కుమ్మరిస్తున్నారు. రూ.11,455 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, రూ.7,927 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. నికరంగా వీరు రూ.3,528 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు అయింది. అలాగే డీఐఐలు ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.1,79,122 కోట్ల విలువైన షేర్లను కొనుగోళ్లు చేశారు. మరోవైపు, మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. ఇంట్రాడేలో 500 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 73,104 పాయింట్లకు చేరుకోగా, నిఫ్టీ 114 పాయింట్లు అందుకొని 22,218 పాయింట్లకు చేరుకున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

