Flexi controversy | గంగాధర, ఏప్రిల్ 12: గంగాధర మండలంలో గత రెండు రోజులుగా సాగుతున్న ఫ్లెక్సీ వివాదం ముగిసింది. గంగాధర మండలంలోని మధురానగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొత్త జయపాల్ రెడ్డి ఫోటోతో కూడిన ఫ్లెక్సీని గట్టుభూత్కూర్ మాజీ సర్పంచ్ కంకణాల విజేందర్రెడ్డి ఏర్పాటు చేశారు.
అనుమతులు లేవన్న నేపంతో స్థానిక గ్రామపంచాయతీ అధికారులు సదరు ఫ్లెక్సీని తొలగించారు. దీంతో ఆగ్రహించిన కొత్త జయపాల్ రెడ్డి రెండు రోజుల క్రితం గంగాధర మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి ఫ్లెక్సీ తొలగించిన విషయంపై అధికారులను నిలదీశారు. ఫ్లెక్సీ తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా శుక్రవారం సాయంత్రం తొలగించిన ఫ్లెక్సీ స్థానంలో తిరిగి కొత్త ఫ్లెక్సీ ని ఏర్పాటు చేయడంతో తాత్కాలికంగా వివాదం ముగిసిందని కొత్త జయపాల్ రెడ్డి మిత్రమండలి సభ్యులు తెలిపారు.