హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎస్పీలుగా పనిచేస్తున్న వారికి ప్రభుత్వం పదోన్నతులు (Promotions) కల్పించింది. అడిషనల్ ఎస్పీగా (Additional Superintendent of Police) పదోన్నతులు కల్పిస్తూ అదే స్థానంలో కొనసాగాలని ఉత్తర్వులు ఇచ్చింది. వేములవాడలో ఏఎస్పీగా పనిచేస్తున్నశేషాద్రిని రెడ్డి (Shesadrini Reddy) అదే స్థానంలో అడిషనల్ ఎస్పీగా , బైంసాలో ఉన్న అవినాష్ కుమార్ను, ఏటూరునాగారంలో ఏఎస్పీగా పనిచేస్తున్న శివం ఉపాధ్యాయను, భువనగిరిలో ఉన్న కంకణాల రాహుల్ రెడ్డిని, ఉట్నూర్లో ఏఎస్పీగా పనిచేస్తున్నకాజల్ సింగ్కు అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.