ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 18 : తెలంగాణ వ్యాప్తంగా ఏండ్ల తరబడి పనిచేస్తున్న వీఓఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వీఓఏల సంఘం రాష్ట్ర జేఏసీ కార్యదర్శి శరత్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ పవన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మం రూరల్ మండల పరిధిలోని వంశీకృష్ణ పంక్షన్హాల్లో జరిగిన ఖమ్మం జిల్లా వీఓఏల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక సంవత్సరాల నుండి చాలీచాలని డబ్బులతో వెట్టి చాకిరి చేస్తున్నా ప్రభుత్వాలు తమ సమస్యలను పట్టించుకోవట్లేదన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా ఉన్న వీఓఏలను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు.
అనంతరం ఉమ్మడి ఖమ్మం జిల్లా వీఓఏల జేఏసీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా జంపాల రమేశ్, అధ్యక్షుడిగా కాటురి మణి, ప్రధాన కార్యదర్శిగా వేల్పుల సుశీల, కోశాధికారిగా విజయకుమారి, జాయింట్ సెక్రటరీగా పసుపులేటి శ్రీలక్ష్మి, సెక్రటరీగా భక్తు రాంబాబు, వైస్ ప్రెసిడెంట్గా ముత్తమాల రాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా జ్యోతిరెడ్డి, పద్మావతి, సలహాదారుడిగా బానోతు భాస్కర్, సభ్యులుగా అరుణ, ప్రసన్న ను ఎన్నుకున్నారు.