Zaheer Khan : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ ముందు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు ఆటగాళ్లు జట్టు మారేందుకు సిద్దమవుతుండగా.. కొందరేమో మేము మీతో కొనసాగలేం అంటూ ఫ్రాంచైజీలను వీడుతున్నారు. టీమిండియా పేస్ దిగ్గజం జహీర్ ఖాన్ (Zaheer Khan) ఐపీఎల్ జట్టుకు బై బై చెప్పేశాడు. ఏడాది క్రితం లక్నో సూపర్ జెయింట్స్(Luckonw Super Giants)కు మెంటార్‌గా నియమితుడైన జహీర్ గురువారం తన బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గొయెంకా (Sanjeev Goenka), కోచ్ జస్టిన్ లాంగర్‌తో పొసగకే అతడు రాజీనామాకు సిద్ధపడినట్టు సమాచారం.
ఐపీఎల్ 2022 ఎడిషన్‌లో అరంగేట్రం చేసిన లక్నో.. వస్తూ వస్తూనే ప్లే ఆఫ్స్ చేరింది. ఆ తర్వాత సీజన్లోనూ ప్లే ఆఫ్స్‌తోనే సరిపెట్టుకున్న లక్నో పదిహేడ్ సీజన్లో మాత్రం నిరాశపరిచింది. దాంతో.. మెంటార్‌గా జహీర్ ఖాన్‌ను నియమించుకుంది లక్నో. అనుభవజ్ఞుడైన ఈ దిగ్గజ పేసర్ రాకతోనైనా తమ జట్టు తొలి ఐపీఎల్ టైటిల్ పట్టేస్తుందని ఫ్రాంచైజీ భావించింది. కానీ, జహీర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. పద్దెనిమిదో సీజన్లో లక్నో పేస్ దళం వైఫల్యం కారణగా ప్రత్యర్థికి భారీ స్కోర్లు సమర్పించుకోవడంతో యజమాని సంజీవ్ గొయెంకా జహీర్‌పై తీవ్ర అసంతృప్తిగా ఉన్నాడు.
Zaheer Khan has decided to part ways with Lucknow Super Giants a year after he took charge as the team mentor
Read more 👉 https://t.co/xqVaCQUdAm pic.twitter.com/yLiN79A3k2
— ESPNcricinfo (@ESPNcricinfo) September 18, 2025
అయితే.. కెప్టెన్ రిషభ్ పంత్‌తో జహీర్‌కు అతడికి మంచి అనుబంధమే ఉండేది. కానీ.. కోచ్ లాంగర్, గొయెంకా తీరుతోనే అతడు విసిగిపోయాడు. 14 మ్యాచుల్లో కేవలం ఆరు విజయాలకే పరిమితమైన లక్నో ఏడో స్థానంలో నిలవడంతో జహీర్‌ను తప్పించాలని మేనేజ్మెంట్ అనుకుంది. ఈ వెటరన్ పేసర్ నిష్క్రమణతో ఎల్ఎస్జీ కొత్త మెంటర్ వేటను ప్రారంభించనుంది. విదేశీ లీగ్స్‌లోని తమ సిస్టర్ ఫ్రాంచైజీ బాధ్యతలు కూడా చూసుకోగల.. సమర్ధుడైన వ్యక్తి కోసం లక్నో వెతుకుతోంది.
భారత జట్టు పేసర్లలో అగ్రగణ్యుడైన జహీర్ ఖాన్ 2011 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం ఐపీఎల్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు బౌలింగ్ కోచ్‌గా సేవలందించాడు. ఐపీఎల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న జహీర్ టీమిండియా బౌలింగ్ కోచ్‌గా ఎంపికవుతాడనే వార్తలు వినిపించాయి. అయితే.. కోచ్ గంభీర్ మాత్రం మొండి పట్టుతో మోర్కెల్‌ను తన టీమ్‌లో చేర్చుకున్నాడు. దాంతో, జహీర్‌కు చాన్స్ దక్కలేదు. అందువల్ల ఈ యార్కర్ కింగ్‌ను లక్నో ఫ్రాంచైజీ తమ మెంటర్‌గా నియమించుకుంది. టీమిండియా తరఫున జహీర్ 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20లు ఆడాడు. ఇక ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్లు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఐపీఎల్లో 100 మ్యాచ్‌లతో సెంచరీ కొట్టాడు.