కొత్తకోట : వనపర్తి జిల్లా (Wanaparthy District) కొత్తకోట తహసీల్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఇద్దరు రెవెన్యూ అధికారులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. గురువారం కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ( Revenue Inspector ) సీ వాసు, మండల సర్వేయర్ ( Surveryor) నవీన్ రెడ్డి బాధితుడి నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు.
బంధువుల భూమికి సంబంధించి విచారణ నిర్వహించి ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్ జారీ చేయాలని తహసీల్ కార్యాలయంలో సంప్రదించగా అందుకు లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో గురువారం మధ్యాహ్నం మాటు వేసి ఆర్ఐ, సర్వేయర్‌ను పట్టు్కుని అరెస్టు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది, అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని, లేదా వాట్సప్‌లో సమాచారం అందించాలని అధికారులు సూచించారు.