హైదరాబాద్ : కొహెడ పర్యటనలో మంత్రి వాకిటి శ్రీహరికి నిరసన సెగ తగిలింది. రంగారెడ్డి జిల్లా కోహెడలో ఎగుమతి ఆధారిత హోల్సేల్ చేపల మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు మంత్రి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతుండగా చేప పిల్లల డబ్బులు వెంటనే చెల్లించాలంటూ మత్స్యకారులు నిరసనకు దిగారు. నిరసన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కొహెడ పర్యటనలో మంత్రి వాకిటి శ్రీహరికి నిరసన సెగ
చేప పిల్లల డబ్బులు వెంటనే చెల్లించాలంటూ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతుండగా నిరసనకు దిగిన మత్స్యకారులు
నిరసన చేస్తున్న వారిని అరెస్ట్ చేసిన పోలీసులు pic.twitter.com/7nnPdWgK2U
— Telugu Scribe (@TeluguScribe) July 10, 2026