యాదాద్రి భువనగిరి : కన్నెపల్లి పంపు హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు కలెక్టరేట్ మెయిన్ గేట్ వద్ద బైఠాయించి వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన, ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం.. చెట్టు మీది దొంగ కాంగ్రెస్ దొంగ, సీఎం డౌన్ డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ అసమర్ధ పాలన వల్లే రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు.
తక్షణమే నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలన్నారు. నిరసన కార్యక్రమలో మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, బూడిద బిక్షమయ్య గౌడ్, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు, చింతల వెంకటేశ్వర్లు, క్యామ మల్లేష్, కల్లూరి రామచంద్రారెడ్డి, ఎలిమినేటి సందీప్ రెడ్డి, బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు పాల్గొన్నారు.