గద్వాల, జనవరి 6 : ‘మాకు బతుకు చూపింది కేసీఆరే.. మా జీవితాల్లో వెలుగు నింపి.. తోవ చూపించిండు. ఆయన ఉన్నప్పుడే బాగుం డే’.. అని పలువురు మత్స్యకారులు అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు జూరాలను సందర్శించి కుడి కాలువ ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు అక్కడున్న మత్స్యకారులతో మాట్లాడారు. ‘రోజూ కూలి ఎంత వ స్తుంది? అది కుటుంబానికి సరిపోతు న్నదా?’ అని అడిగారు. భార్యాభర్తలు కష్టపడితే రోజుకు రూ.500 రావడం కష్టంగా ఉందని వారు బదులిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పథకం కూడా సరిగ్గా ఇస్తలేదని చెప్పారు. పింఛన్లు పెంచి ఇస్తామని ఇవ్వడం లేదని, మహిళలకు రూ.2,500 కూడా ఇస్తలేదని వారు బీఆర్ఎస్ బృందం ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నా రు. కేసీఆర్ హయాంలోనే చేపలు పట్టేందుకు వలలు, విక్రయించేందుకు వాహనాలు అందించి తమకు బతుకు చూపారని గుర్తుచేసుకున్నారు. ఈ సారి ఎన్నికలు వస్తే కేసీఆర్‌కే ఓటేస్తామని చెప్పారు. రూ.2,500 ఇస్తే ఓటు ఎవరికి వేస్తారని శ్రీనివాస్‌గౌడ్ మత్స్యకార మహిళలను ప్రశ్నించగా ఎన్ని డబ్బులు ఇచ్చినా ఓటు మాత్రం కేసీఆర్‌కేనని స్పష్టంచేశారు.