ఈ నెల 26న కనువిందు చేయనున్న బ్లడ్‌మూన్
ఈ నెల 26న కనువిందు చేయనున్న బ్లడ్‌మూన్ | ఈ నెల 26న వినీలాకాశంలో బ్లడ్‌మూన్ కనువిందు చేయనుంది. భూమికి దగ్గరగా రావడంతో ఆపటు సాధారణ రోజుల్లో కంటే పెద్దగా కనిపించనున్నాడు.

న్యూఢిల్లీ : ఈ నెల 26న వినీలాకాశంలో బ్లడ్‌మూన్ కనువిందు చేయనుంది. భూమికి దగ్గరగా రావడంతో పాటు సాధారణ రోజుల్లో కంటే చంద్రుడు పెద్దగా కనిపించనున్నాడు. ఎరుపు, నారింజ రంగుల్లో దర్శనమివ్వనున్నాడు. ఈ ఏడాదిలో మొదటి సంపూర్ణ చంద్ర గ్రహణం ఇదే. తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్, అమెరికాల్లో కనిపిస్తుంది. భారత్‌లో పాక్షికంగా కనిపించే అవకాశం ఉంది. చాలా ప్రదేశాల్లో పాక్షిక గ్రహణాన్ని వీక్షించడానికి అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ బ్లడ్‌మూన్ పాక్షికంగా కనిపిస్తుంది. మళ్లీ జూన్ 10న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఆ తర్వాత నవంబర్ 19న పాక్షిక చంద్రగ్రహణం, ఏడాది చివర డిసెంబర్ 4న మరోసారి సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించనుంది.
బ్లడ్ మూన్ అంటే..
ఒకే సరళరేఖపై ఉన్న సూర్య, చంద్రుల మధ్యలోకి భూమి వచ్చినప్పుడు చందగ్రహణం ఏర్పడుతుంది. సూర్యకాంతితో ధవళ వర్ణంలో మెరిసే జాబిల్లి ఆనాడు వెలవెలబోతుంది. ప్రతి నెలా భూమి, సూర్య, చంద్రులు ఒకే సరళరేఖ పైకి వస్తుంటారు. అయితే భూమి ఓ వైపునకు వంగి భ్రమించడం వల్ల దీని నీడ చంద్రుడి పై నుంచి లేదా కింద నుంచి వెళ్లిపోతుంటుంది. దీంతో గ్రహణం ఏర్పడదు. ఒక్కోసారి గ్రహణం ఏర్పడే సమయంలో.. భూ వాతావరణం గుండా పయనించే కాంతి చంద్రుడిపై పడుతుంది. దీంతో జాబిల్లి ఎరుపు వర్ణంలో కనిపిస్తుంది. ఈ పరిణామాన్నే బ్లడ్ మూన్‌గా పిలుస్తారు. భూమిపై వాతావరణంలో మేఘాలు, పారదర్శకతపై ఇది ఆధారపడి ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
తూర్పు గోదావరిలో రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
పాలస్తీనా – ఇజ్రాయెల్ మధ్య తగ్గని ఉద్రిక్తతలు.. దాడుల్లో 72 మంది మృతి
అమెరికాలో భారీగా తగ్గిన కరోనా మరణాలు
తమిళనాడు రసాయన పరిశ్రమలో ప్రమాదం.. నలుగురు మృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్‌కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

