Lok Sabha Elections | తొలి దశ పోలింగ్ 62 శాతం.. మణిపూర్, బెంగాల్లో హింసాత్మక ఘటనలు
లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల మొదటి అంకం శుక్రవారం విజయవంతంగా పూర్తయింది. చెదురుమదురు ఘటనలు, కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు మినహా తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
- గత ఎన్నికలతో పోలిస్తే 7 శాతం తగ్గిన ఓటింగ్
- ఛత్తీస్‌గఢ్‌లో గ్రనేడ్ పేలి జవాన్ మృతి
- రాత్రి 7 గంటల తర్వాత కూడా సాగిన పోలింగ్
Lok Sabha Elections | న్యూఢిల్లీ, కోల్‌కతా, ఇంఫాల్, ఏప్రిల్ 19: లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల మొదటి అంకం శుక్రవారం విజయవంతంగా పూర్తయింది. చెదురుమదురు ఘటనలు, కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు మినహా తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కోట్లాది మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 102 సీట్లకు 21 రాష్ర్టాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలో జరిగిన పోలింగ్‌లో రాత్రి 7 గంటల వరకు 62 శాతం పోలింగ్ నమోదైంది. అయితే 2019 ఎన్నికలు (69.43 శాతం) మొదటి విడతతో పోలిస్తే ఇది తక్కువేనని ఈసీ తెలిపింది. పోలింగ్ సాయంత్రం ఆరు గంటలకే ముగిసినా, కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు బారులు తీరడంతో రాత్రి 7 గంటల తర్వాత కూడా పోలింగ్ కొనసాగింది. మొదటి విడత ఎన్నికల్లో 1600 మందికి పైగా అభ్యర్థులు పోటీ పడగా, వారిలో 8 మంది కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఒక మాజీ గవర్నర్ ఉన్నారు. మొదటి విడత పోలింగ్‌లో అత్యధికంగా తమిళనాడులో-39, రాజస్థాన్‌లో-12, ఉత్తర ప్రదేశ్‌లో-8, మధ్య ప్రదేశ్‌లో-6, ఉత్తరాఖండ్‌లో-5 లోక్‌సభ స్థానాలలో ఎన్నికలు జరిగాయి. వీటితో పాటు అరుణాచల్ ప్రదేశ్ (60), సిక్కిం (32) అసెంబ్లీలకు కూడా శుక్రవారమే పోలింగ్ జరిగింది.
ఈవీఎంలపై ఫిర్యాదులు
ఛత్తీస్‌గఢ్, మణిపూర్, బెంగాల్ రాష్ర్టాల్లో చెదురుమదురు ఘటనలు మినహా మిగతా రాష్ర్టాల్లో పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. పలు చోట్ల ఈవీఎంలు పనిచేయలేదంటూ ఫిర్యాదులు అందాయి. అయితే అధికారులు వెంటనే కలుగజేసుకుని వాటి స్థానంలో వేరేవి ఏర్పాటు చేశారు. తమిళనాడులో ఇద్దరు వృద్ధులు పోలింగ్ బూత్‌లలో మరణించారు.
మణిపూర్‌లో గాల్లోకి కాల్పులు
తొలి దశ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా పలు రాష్ర్టాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకొన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోని గాల్గమ్ గ్రామంలో అండర్ బ్యారెల్ గ్రనేడ్ లాంచర్(యూబీజీఎల్) ప్రమాదవశాత్తూ పేలడంతో విధులు నిర్వర్తిస్తున్న జవాన్ మృతి చెందాడని అధికారులు తెలిపారు. మరో ఘటనలో బైరాంగఢ్ పోలీసుస్టేషన్ పరిధిలోని చిహ్కా పోలింగ్ కేంద్రం సమీపంలో నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలి మరో సీఆర్పీఎఫ్ జవాన్ గాయపడ్డారు. పశ్చిమబెంగాల్లో కూచ్‌బెహర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పలు చోట్ల టీఎంసీ, బీజేపీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. మణిపూర్‌లోని ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గం థమ్నాపోక్పి ఏరియాలో ఓటర్లను చెదరగొట్టేందుకు కొంత మంది సాయుధ వ్యక్తులు గాల్లోకి పలు రౌండ్ల కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు.
‘ఈశాన్యం’పై కమలం ఆశలు
ఈసారి ఈశాన్య రాష్ర్టాలలో 22 నుంచి 25 ఎంపీ సీట్లను గెల్చుకోవాలని కమలం పార్టీ గట్టి ఆశతో ఉంది. అలాగే మమత ప్రభుత్వంపై ఏర్పడిన అసంతృప్తి ఈసారి తమకు బెంగాల్‌కు తమకు మరిన్ని సీట్లు తెస్తుందని ఆ పార్టీ భావిస్తున్నది. తమిళనాడులో ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి ఈసారి బ్రేక్ పడుతుందని, ఎస్ రాందాస్‌కు చెందిన పీఎంకే లాంటి చిన్న పార్టీలతో ఏర్పాటు చేసుకున్న పొత్తు మంచి ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నది. బీహార్‌లో నితీశ్‌తో పొత్తు అనుకూలిస్తుందని భావిస్తున్నది.
ఇండియా కూటమి ఆపసోపాలు
ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని అధికారంలోంచి దించాలన్న ఏకైక లక్ష్యంతో ఏర్పడిన ఇండియా కూటమికి ఆదిలోనే అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. ఆ కూటమిలో ప్రధాన పాత్ర పోషించిన బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రధాని మోదీతో చేతులు కలిపి ఎన్డీఏ కూటమిలో చేరడం ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్‌కు గట్టి షాక్ ఇచ్చింది. దీనికి తోడు బెంగాల్లో పొత్తుకు మమతా బెనర్జీ నిరాకరించడం, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడం వంటి చర్యలతో ఆ కూటమి కుదేలైందని విశ్లేషకులు భావిస్తున్నారు.
రాష్ర్టాలు/యూటీల వారీగా పోలింగ్ శాతం (రాత్రి 7 గంటల వరకు)
- అండమాన్ నికోబార్ 56.87
- అరుణాచల్ ప్రదేశ్ 65.46
- అస్సాం 71.38
- బీహార్ 47.49
- ఛత్తీస్‌గఢ్ 63.41
- జమ్ము-కశ్మీర్ 65.08
- లక్షద్వీప్ 59.02
- మధ్య ప్రదేశ్ 63.33
- మహారాష్ట్ర 55.29
- మణిపూర్ 68.62
- మేఘాలయ 70.26
- మిజోరం 54.18
- నాగాలాండ్ 56.77
- పుదుచ్చేరి 73.25
- రాజస్థాన్ 50.95
- సిక్కిం 68.06
- తమిళనాడు 62.19
- త్రిపుర 79.90
- ఉత్తర ప్రదేశ్ 57.61
- ఉత్తరాఖండ్ 53.64
- పశ్చిమ బెంగాల్ 77.57
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

