Manne Krishank | కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నిరసనల పరంపర కొనసాగుతోంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ ఆధ్వర్యంలో బేగంపేట్ విమానాశ్రయం రోడ్డు వద్ద కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి నిరసనకు దిగారు. కాంగ్రెస్ హామీలు, డిక్లరేషన్లు, గ్యారంటీలు, సీఎం రేవంత్ విదేశీ పర్యటనలు, 77 ఢిల్లీ పర్యటనల ఖర్చులపై 420 ఫీట్ల భారీ బ్యానర్లతో భారీ ఎత్తున నిరసన చేపట్టారు.
పోలీసులు బ్యానర్ కార్డులను ఎత్తుకెళ్లిపోవడంతో పోలీసులకు బీఆర్ఎస్ నాయకులు, మన్నె క్రిశాంక్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులకు తనదైన శైలిలో చురకలంటించారు మన్నె క్రిశాంక్. ఆర్మీలో రైఫిళ్లు దొంగతనం అయినయ్ సార్.. అట్లాంటివి పట్టుకోండి సార్.. బాకీ కార్డులు తీసుకొని వెళ్తారేంటి సార్… మా బాకీ కార్డులు తెచ్చే వరకు మేం ఇక్కడి నుంచి పోం.. అంటే ఏం దొంగతనం అయినవో కంప్లైయింట్ అని పోలీస్ అధికారి అనడం వీడియోలో చూడొచ్చు.
ఆర్మీ రెజిమెంట్‌లో దొంగిలించిన రైఫిళ్లు పట్టుకోండి సార్.. మా బాకీ కార్డులు కాదు
పోలీసులను ప్రశ్నించిన మన్నె క్రిషాంక్ https://t.co/fP8dfWOBua pic.twitter.com/BChnpmDbkD
— Telugu Scribe (@TeluguScribe) September 2, 2026
Jailer 2 | జైలర్ 2’ రిలీజ్‌పై క్లారిటీ.. ఆ డేట్‌కి ప్రపంచవ్యాప్తంగా రజినీకాంత్ మాస్ జాతర!
ప్రజా వ్యతిరేక పాలనపై భగ్గుమన్న బీఆర్ఎస్ మిర్యాలగూడ శ్రేణులు
ఢిల్లీ వాళ్ల కాళ్ల ముందు తెలంగాణ ఆత్మ గౌరవం : మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్