Shobhareddy | నేను చాలా తక్కువ చెప్పిన.. సీఎం సన్నిహితుడి ప్రవర్తనపై మహిళా వ్యాపారవేత్త కే శోభా రెడ్డి
Shobhareddy | ఏదో అమ్మాయిని నేను కూడా ఎదగాలని కోరుకుంటా.. నా ఫ్యామిలీని పోషించుకోవాలనుకుంటా..నేను కూడా ఇంకో 10 మంది ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆశ ఉంటది నాకు. అందులో భాగంగా నేను సీఎం కార్యాలయాన్ని సంప్రదించాను.
Shobhareddy | రేవంత్ సర్కార్‌లో ఓ మహిళా ఎంటర్ప్రెన్యూర్ ఏకంగా సీఎం సన్నిహితుడి నుంచి ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడిస్తూ తన ఆవేదన వ్యక్తం చేసిందని తెలిసిందే. సీఎం సన్నిహితుల వేధింపుల గురించి ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేసుకుంది. సాయం కోరితే తనను సీఎం సన్నిహితుడు గెస్ట్ హౌస్‌కు రమ్మని పిలిచాడని కె.శోభా రెడ్డి అనే మహిళా వ్యాపారవేత్త వాపోయింది.
తాజాగా ఈ ఘటనపై కె.శోభా రెడ్డి మరోసారి నెట్టింట ఓ వీడియో షేర్ చేసింది. నేను చేసిన ట్వీట్ గురించి రకరకాల ఊహాగానాలు లేవనెత్తుతున్నారు. ఆ పార్టీవాళ్లు పెట్టిస్తున్నారా..? ఈ పార్టీవాళ్లు పెట్టిస్తున్నారా..? అని నెగెటివ్కామెంట్స్ పెడుతున్నారు. నాకు ఏ పార్టీలతో సంబంధం లేదు. ఒక అమ్మాయి బయటకు వచ్చి ఓ విషయం చెప్పిందంటే.. దాంట్లో ఎంత పారదర్శకత ఉంది.. ఎలా సాయం చేస్తమని చూడండి కానీ పార్టీలతో లింకులు పెట్టడమేంటి..? ఏ పార్టీ వాళ్లు ఏ సమస్య గురించి మాట్లాడొద్దా అని ప్రశ్నించింది. మాట్లాడితే మీరు ప్రతిపక్షం వాళ్లు కాబట్టి కావాలనే మీరిట్లా మాట్లాడుతున్నరని అంటరా..? ఎవ్వరు ఏ పార్టీవాళ్లైనా ఒక సమస్య వచ్చినప్పుడు అందరూ స్పందించాలి. . అందరూ మాట్లాడాలి.. తగిన న్యాయం చేయాలని ఎవరైనా బాధితులు కోరుకుంటరు.
నేను అడ్వర్టైజింగ్ ఏజెన్సీ.. నేను పని కోసం చాలా మందిని సంప్రదించా. ఎమ్మెల్యేలు, మంత్రులు అందనినీ కలిశాను. అయితే వాళ్లు ఇది సీఎంకు సంబంధించిన సబ్జెక్టు కదా వెళ్లి ఆయనను కలవండి అన్నారు. అక్కడ సెక్రటేరియట్‌కు వెళ్తే ఆ ఫ్లోర్‌కు వెళ్లేందుకు అనుమతి ఉండదు. అపాయింట్మెంట్ ఇయ్యరు.. ఎంఏయూడీలో ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చిన. జీహెచ్ఎంసీలో, సీఎంసీలో కూడా ఇచ్చిన. అయినా కానీ ఏం పట్టించుకోరు.. అయ్యా నాకు హెల్ప్ చేయండి.. నాకు అవకాశం ఇప్పించండి. మాకేం కర్మ.. ఎందుకు అడుక్కుంటం.. అడక్కున్నం.. ఏదో అమ్మాయిని నేను కూడా ఎదగాలని కోరుకుంటా.. నా ఫ్యామిలీని పోషించుకోవాలనుకుంటా..నేను కూడా ఇంకో 10 మంది ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆశ ఉంటది నాకు. అందులో భాగంగా నేను సీఎం కార్యాలయాన్ని సంప్రదించాను. అయితే వాళ్లు అవును, లేదా కాదు చెప్పాల్సి ఉండే.. కానీ వేరే లాగా మాట్లాడేది కాకుండే. చెడ్డగా ప్రవర్తించేది లేకుండే.. నేను ఇవన్నీ బయట చెప్పాలనుకుంటలేను.. నేను చాలా తక్కువ చెప్పిన అంటూ జరిగిన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది.
రేవంత్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది.
ఓ మహిళా వ్యాపారవేత్త అపాయింట్మెంట్ కోసం వస్తే, సీఎం సన్నిహితుడంటూ ఫామ్‌హౌస్‌కు, కారులోకి రమ్మని వేధించిన ఆ కామాంధుడు ఎవరో రేవంత్ సమాధానం చెప్పాలి!
ధైర్యంగా ముందుకు వచ్చి ఆధారాలు ఉన్నాయని మొరపెట్టుకుంటున్నా ఎందుకు చర్యలు లేవు?… pic.twitter.com/XFCADWgyFI
— BRS Party (@BRSparty) September 21, 2026
Read Also :
Jagadish Reddy | పంటలను ఎండబెడుతున్న పాపం కాంగ్రెస్‌దే : ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
Project Cheetah | దేశంలో 8 నుంచి 52కు పెరిగిన చీతాల సంఖ్య.. ప్రాజెక్ట్ చీతా విజయవంతం
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

