Kailash Vijayvargiya | ‘దీదీ బరువు పెరిగింది’.. మహిళా కౌన్సిలర్‌ను ఎగతాళి చేసిన బీజేపీ మంత్రి
Kailash Vijayvargiya | బీజేపీ మంత్రి ఒక మహిళా కౌన్సిలర్‌ను ఎగతాళి చేశారు. ఆమె శరీర ఆకృతిపై వ్యాఖ్యలు చేశారు. ‘దీదీ బరువు పెరిగింది’ అని బహిరంగ సమావేశంలో ఆయన అన్నారు. ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో ఆ బీజేపీ మంత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి.
భోపాల్: బీజేపీ మంత్రి ఒక మహిళా కౌన్సిలర్‌ను ఎగతాళి చేశారు. ఆమె శరీర ఆకృతిపై వ్యాఖ్యలు చేశారు. ‘దీదీ బరువు పెరిగింది’ అని బహిరంగ సమావేశంలో ఆయన అన్నారు. ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో ఆ బీజేపీ మంత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి. (Kailash Vijayvargiya) బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం మంత్రి కైలాష్ విజయవర్గీయ, ఇండోర్‌లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి మహిళా వార్డు కౌన్సిలర్ సంధ్యా యాదవ్ కూడా హాజరయ్యారు.
కాగా, ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడేందుకు వార్డు కౌన్సిలర్ సంధ్యా యాదవ్ మైక్ వద్దకు వెళ్తుండగా మంత్రి కైలాష్ విజయవర్గీయ ఆమె శరీర ఆకృతిపై కామెంట్లు చేశారు. ‘సంధ్యా దీదీ కూడా కొంచెం బరువు పెరిగింది’ అని ఆయన అన్నారు. ఆమెతో పాటు అక్కడున్న వారు నవ్వుకున్నారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ మహిళా కౌన్సిలర్ శారీర ఆకృతిని ఎగతాళి చేసిన మంత్రి కైలాష్ విజయవర్గీయపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆయనపై మండిపడింది. ‘బీజేపీ తరచుగా మహిళల గౌరవం గురించి మాట్లాడుతుంది. కానీ ఆ పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్ విషయంలో సహా మహిళల శారీరక రూపురేఖలపై బీజేపీ నేతలు వ్యాఖ్యానించడం ఒక పరిపాటిగా మారింది’ అని ఏఐసీసీ మీడియా కోఆర్డినేటర్ నీలభ్ శుక్లా విమర్శించారు.
Madhya Pradesh – Urban Development Minister Kailash Vijayvargiya is under fire after a video showed him laughing and remarking that BJP councillor Sandhya Yadav’s “width has increased a bit.” Congress has called the line body-shaming and demanded a public apology.The comment was… pic.twitter.com/nHeHNfdHsR
— NextMinute News (@nextminutenews7) September 21, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- body shaming
- event
- Indore
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

