యాదాద్రి భువనగిరి : జిల్లాలోని బీబీనగర్ వద్ద ఎయిమ్స్ ఏర్పాటు చేసి నేటికి ఏడాది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియ, జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, డీసీపీ నారాయణరెడ్డి, ఎయిమ్స్ ప్రొఫెసర్లు, డాక్టర్లు, సిబ్బంది, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్ విషయంలో భారత దేశము ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలకు మన వ్యాక్సినేషన్ పంపించడం గర్వంగా ఉందన్నారు. వైద్య సేవలను అంకితభావంతో నిర్వహించాలని, గైనకాలజిస్ట్ గా తాను వైద్య సేవలు అందించిన నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఎంబీబీఎస్ మొదటి సంవత్సరము పూర్తి చేసుకున్న విద్యార్థులు, గోల్డ్ మెడల్ సాధించిన వారికి మెడల్స్ ప్రదానం చేశారు.
Privileged to address first annual celebrations of #AIIMS Bibinagar, Hyderabad. Emphasised Doctors to strive hard for more medical inventions & innovations, As doctors and medical professionals we must be proud that India is helping & leading the world in #COVID19 vaccination. pic.twitter.com/9IKxgIeDgi
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) March 10, 2021