హుజూరాబాద్ రూరల్ : కేసీఅర్ ప్రతిష్టాత్మకంగా దళితల అభ్యున్నతికి ప్రవేశపెట్టిన దళిత బంధును ఆపిన బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై దళిత జాతి బగ్గుమన్నది. మంగళవారం మండలంలోని చెల్పూర్, కనుకులగిద్ద, కందుగులతో పాటు పలు గ్రామాల్లో డప్పు చప్పుల్లతో ఈటల రాజేందర్ శవ యాత్ర నిర్వహించారు. దిష్టి బొమ్మలను దగ్దం చేశారు.
ఈ సందర్బంగా దళితులు మాట్లాడుతూ బీజేపీ నేత ఈటల రాజేందర్ అధికారంలో ఉన్నప్పుడు దళితులను పట్టించు కోలేదు. బీజేపీలో కలిసి దళిత బంధు నిలిపి వేసి పొట్టలు కొట్టాడన్నారు. ఈటల రాజేందర్‌ను దళిత సమాజం క్షమించ దని, రాబోయే రోజుల్లో దళితుల చేతుల్లోనే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
ఈ కార్యాక్రమంలో అయా గ్రామాల దళితులు చల్లూరి శరబందం, పాపయ్య, బత్తుల విష్ణువర్థన్, రాములు, రాజయ్య, బిక్షపతి, రవి, సాంబరాజు, ప్రభాకర్, రాజు, మునిశ్వర్, సంపత్, హరిప్రసాద్, శనిగరపు రేఖ, వనతడుపల భాబు, సుధామోహన్, అశోక్, అకినపల్లి రవి, అరుణ, అంబాల బాబుతో పాటు తదితరులు ఉన్నారు.