Ieeja | జోగులాంబ గద్వాల జిల్లా అయిజాలో అగ్నిప్రమాదం జరిగింది. డ్రిప్ పైపుల ఫ్యాక్టరీలో అకస్మా్త్తుగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో నిల్వ ఉంచిన ప్లాస్టిక్ డ్రిప్ పైపులు, ముడిసరుకు, యంత్రాలు మంటల్లో దగ్ధమయ్యాయి. వేగంగా మంటలు వ్యాపించడంతో పాటు, దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. అయితే లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కాగా, ఫ్యాక్టరీల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని, విద్యుత్ వ్యవస్థను తరచూ పరిశీలించాలని స్థానికులు ఈ సందర్భంగా కోరుతున్నారు.