తుంగతుర్తి, ఏప్రిల్ 6 : తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన ఏగూరి చంద్రయ్య ఇటీవల అనారోగ్యానికి గురై మరణించడంతో అతని తోటి స్నేహితులు ఆ కుటుంబానికి సోమవారం అండగా నిలిచారు. తమతో కలిసి చదువుకున్న బాల్య మిత్రుడు చనిపోవడంతో స్నేహితులంతా కలిసి ఆ కుటుంబాన్ని పరామర్శించి రూ.21,500 ఆర్థిక సాయం అందజేశారు. తమ మిత్రుని కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఏగూరి చంద్రయ్య ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమంలో చురుగ్గా పని చేశారని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మిత్రులు వీరబోయిన నాగయ్య, కటకం శ్రీను, కునీయత్ నవీన్ కుమార్, సంతోషి, శాంతయ్య, మైసయ్య, సుదర్శన్ పాల్గొన్నారు.