తాండూర్ : చిన్నతనం నుంచే కంటిచూపుతో ఇబ్బంది పడుతున్న ఓ స్నేహితుడికి ఆపన్నహస్తం (Financial assistance) అందించారు. మంచిర్యాల జిల్లా ( Manchryala District ) తాండూర్ మండలం మాదారం టౌన్‌షిప్‌నకు చెందిన అన్నందాసరి చంద్రయ్య( Dasari Chandraiah ) చిన్నప్పటి నుంచే కంటిచూపుతో ( Eye operation) ఇబ్బందులు పడుతున్నాడు.
చికిత్స కోసం అనేక ఆసుపత్రులు తిరిగినా ఇప్పటివరకు కంటి చూపు మెరుగు కాలేదు. చివరిసారిగా ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ హైదరాబాదులో టెస్ట్ చేయించుకోగా ఆరోగ్యశ్రీలో కొంతవరకే వర్తిస్తుందని, మిగతా డబ్బులు సొంతగా భరించాలని సూచించారు.
దీంతో ఇప్పటికే ఆర్ధిక ఇబ్బందులతో సతమవుతున్న చంద్రయ్య 1989-1990 బ్యాచ్‌కు చెందిన తోటి స్నేహితుల సాయం కోరాడు. వారు స్పందించి 30 వేల రూపాయలు జమచేసి వారికి అందించి అండగా నిలిచారు. బాధితుడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ దాదాపు 25 సంవత్సరాల తరువాత నాటి స్నేహితుడిని గుర్తించుకుని సాయం చేయడం గొప్ప విషయమని కొనియాడారు.