kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్, మార్చి 26 : మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 1999-2000 టెన్త్ క్లాస్ విద్యార్థిని బందెల రాజశేఖర్ కు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతడు కుడి కాలు కోల్పోయాడు. కాగా స్పందించిన రాజశేఖర్ తోటి క్లాస్మెట్స్ రూ.18వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్దవేన రాజు, జాలిగం రమేష్, తనుగుల నవీన్, నాగులమల్యాల కిషన్, ఎండీ అహ్మద్ పాషా, కోట లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.