E POS Machines | జహీరాబాద్, మే 19 : ఈ పాస్ యంత్రాల ద్వారానే ఎరువులను విక్రయించాలని జహీరాబాద్ డివిజన్ వ్యవసాయ శాఖ ఏడిఏ భిక్షపతి అన్నారు. ఇవాళ జహీరాబాద్ మండలం రంజోల్ రైతు వేదికలో డీలర్లకు ఈ పాస్ యంత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జహీరాబాద్ ప్రాంతం ఇతర రాష్ట్రాలకు పక్క రాష్ట్రం కావడంతో ఇక్కడి నుంచి పక్క రాష్ట్రాలకు ఎరువులు తరలించే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే జూన్ కాలం ఎంతో జాగ్రత్తగా ఉండి ఆధార్ కార్డు లింక్ చేసిన తర్వాతనే ఎరువులను పంపిణీ చేయాలని గతంలో మాదిరిగా తప్పులు చేయకుండా మీరు ఎంత దిగుమతి చేసుకున్నారు. ఎంత ఎరువులు ఎవరి పేరు మీద అమ్మారు అనేది ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు కూడా తెలిసే అవకాశం ఉందన్నారు.
కావున ఈ పాస్ మిషన్లో తప్పనిసరిగా ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏడీ శ్రీనివాస ప్రసాద్, జహీరాబాద్ ఏడిఏ భిక్షపతి మండల వ్యవసాయ అధికారులు లావణ్య అభినాష్ వర్మ, వినోద్ కుమార్ , శ్రీకాంత్ రాహుల్, కోరమాండల్ కంపెనీ ప్రతినిధులు పి ప్రసాద్ సుదర్శన్ రెడ్డి జహీరాబాద్ న్యాల్కల్ మండలాల ఫర్టిలైజర్స్ డీలర్స్ పాల్గొన్నారు.
Karimnagar | బొమ్మనపల్లిలో అగ్ని ప్రమాదం.. రూ. 2 లక్షలకు పైగా నష్టం..
Landslides | కైలాస్ యాత్ర మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకుపోయిన వందలాది మంది యాత్రికులు
Warangal fort | కోటను సందర్శించిన రాజు కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ