కోటపల్లి : తెలంగాణలో ఎరువుల కొరత (Fertilizer shortage) ప్రభుత్వ వైఫల్యమేనని బీఆర్ఎస్ ( BRS ) చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజారమేష్ ( Raja Remesh ) ఆరోపించారు. ఎరువుల కొరతను నిరసిస్తూ కోటపల్లి మండలకేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజారమేష్ మట్లాడుతూ మంత్రి నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు రోజుల తరబడి పడిగాపులుగాస్తున్న పట్టించుకునే నాథుడు కరువు అయ్యాడని పేర్కొన్నారు.
ఎరువుల పంపిణీ కేంద్రంలో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నా అధికార పార్టీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఎరువుల కొరత రాకుండా చూసుకుంటే ఈ ప్రభుత్వం ముందు చూపులేక కృత్రిమ ఎరువుల కొరత వచ్చేలా వ్యవహరించిందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా మంత్రి వివేక్, ఎంపీ వంశీ రైతులు పడుతున్న ఇబ్బందుల పై దృష్టి సారించి రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ సాంబాగౌడ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి మారిశెట్టి విద్యాసాగర్, చెన్నూర్ మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్ మంత్రి బాపు, మోతె తిరుపతి, సాదనబోయిన కృష్ణ, రాంలాల్, నాయకులు రాళ్ళబండి శ్యాంసుందర్, ఆసంపల్లి సంపత్, రేవెళ్ళ మహేష్, గుగ్లోత్ బాపు నాయక్, భారతి, అజయ్ తదితరులు పాల్గొన్నారు.