కరీమాబాద్, మార్చి 4 : ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా బంధువు అని ఎమ్మెల్యే నన్నపునేని నేందర్ అన్నారు. మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 3 రో జుల వేడుకలు నిర్వహించునున్న నేపథ్యంలో శుక్రవా రం శాంతినగర్‌లోని రాజశ్రీ గార్డెన్లో కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం లో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. మహిళలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉందన్నారు. ఆడబిడ్డల సంక్షేమానికి, రక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. అంబరాన్నంటేలా చేపట్టనున్న కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని వి జయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ముష్కమల్ల అరుణ, సిద్దం రాజు, మరుపల్ల రవి, పోశాల పద్మ, కవిత, సురేశ్, సువర్ణ, కుమారస్వామి, కల్పన, మాజీ కార్పొరేటర్లు కేడల పద్మ, పల్లం రవి, నాగపురి కల్పన, బత్తిని వసుంధర, నాయకులు మ సూద్, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 6, 7, 8వ తేదీన కార్యక్రమాలను అంబరాన్నంటేలా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఖిలావరంగల్ : మురికి వాడలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 37వ డివిజన్లోని గిరిప్రసాద్‌నగర్, బుడిగ జంగాలకాలనీ, ఎం ఎం నగర్లో ఎమ్మెల్యే నరేందర్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్లమ్ ఏరియాల్లో రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు తదితర వసతు లు కల్పిస్తామన్నారు. గుడిసెవాసులందరికీ 15 రోజు ల్లో మిషన్ భగీరథ ద్వారా మంచి నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. బస్తీ దవాఖాన, పింఛన్లు, రేషన్ కార్డు లు అందిస్తామన్నారు. మురికి కాలనీలను మాడల్‌గా తీర్చి దిద్దుతామన్నారు. అనంతరం క్యాన్సర్‌తో బాధపడుతున్న సయ్యద్ మహీదాబీని పరామర్శించారు. మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్ యాదవ్, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు భోగి సురేశ్, గిరిప్రసాద్‌నగర్ అధ్యక్షుడు ఎండీ ఉల్ఫత్, ఎంఎం నగర్ అధ్యక్షుడు సింగారపు ఏలియా, ఎండీ ఫిరోజ్ పాల్గొన్నారు.