వాషింగ్టన్, ఏప్రిల్ 15 : మానవ అవయవాల్లో కిడ్నీ, కాలేయం అత్యంత కీలకమైనవి. హఠాత్తుగా ఇవి వైఫల్యం చెందితే.. మానవుల్లో రక్తాన్ని శుద్ధి చేయటానికి (డయాలిస్) పంది కాలేయం వాడొచ్చా? అన్నదానిపై అమెరికా సైంటిస్టుల పరిశోధనలు కీలక దశకు చేరుకున్నాయి. ఇందుకు సంబంధించి క్లినకల్ ట్రయల్స్‌కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్గాన్ఎక్స్ సంస్థతో కలిసి క్లినికల్ ట్రయల్స్ చేపడుతున్నట్టు జన్యు మార్పిడి పందుల్ని ఉత్పత్తి చేస్తున్న ‘ఈ-జెనెసిస్’ అనే సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.