జగిత్యాల జిల్లాలో విషాదం.. కరోనాతో తండ్రి కొడుకుల మృతి
జగిత్యాల జిల్లాలో విషాదం.. కరోనాతో తండ్రి కొడుకుల మృతి | జగిత్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ధర్మపురి మండలం కొసునూరుపల్లెలో రెండు వారాల వ్యవధిలో తండ్రికొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ధర్మపురి : జగిత్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ధర్మపురి మండలం కొసునూరుపల్లెలో రెండు వారాల వ్యవధిలో తండ్రికొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొసునూరుపల్లెకు చెందిన ఉట్కూరు హన్మంతరెడ్డి (75) మే 7న కరోనాకు పాజిటివ్‌గా పరీక్షలు చేశారు. దీంతో ఆయనను చూసుకునేందుకు సింగపూర్‌లో ఉంటున్న తనయుడు గంగిరెడ్డి స్వగ్రామానికి చేరుకున్నాడు.
వైరస్ బారినపడ్డ హన్మంతరెడ్డికి దగ్గరుండి కొడుకు సేవలందించాడు. ఈ క్రమంలోనే గంగిరెడ్డి సైతం కరోనా బారినపడ్డారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హన్మంతరెడ్డి మే 15న మృతి చెందారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. గంగిరెడ్డి ఆరోగ్య పరిస్థితి సైతం విషమించడంతో శనివారం మృతి చెందాడు. రెండు వారాల వ్యవధిలో తండ్రి కొడుకులు వైరస్ బారినపడి మృతి చెందడంతో కుటుంబీకులు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోగా.. గ్రామంలో విషాదం అలుముకున్నది.
ఇవి కూడా చదవండి..
షుగర్ కంట్రోల్‌తో బ్లాక్ ఫంగస్‌కు చెక్
వ్యాక్సిన్ వేసుకున్న వారికి కరోనా వచ్చినా చనిపోలేదు: ఎయిమ్స్ అధ్యయనం
పార్టీ ప్రధాన కార్యదర్శులతో బీజేపీ చీఫ్ భేటీ
ట్రంప్ ఖాతాపై ఫేస్బుక్ రెండేళ్ల నిషేధం
రైతులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం
నేటి నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల స్థావరం పేల్చివేత
దేశంలో తగ్గుతున్న కరోనా.. 24 గంటల్లో 1.20లక్షల కేసులు
ప్రకృతితో మమేకమై జీవించాలి : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
Good News : త్వరలో పిల్లలకు అందుబాటులోకి టీకా!
మళ్లీ పట్టాలెక్కిన ప్యాసింజర్ రైళ్లు
విషాదం.. న్యూబోయినపల్లిలో నాలాలో పడి బాలుడి గల్లంతు
‘ధరణి’ సమస్యలపై ఇక ఫిర్యాదులను వాట్సాప్, మెయిల్ చేయొచ్చు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

