జహీరాబాద్, మే 12 : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం శంశోల్లాపూర్ గ్రామ శివారులో కర్ణాటక సరిహద్దులో బీదర్-జహీరాబాద్ ప్రధాన రోడ్డుపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు దుర్మరణం పాలయ్యారు. బస్సులో ప్రయాణిస్తున్న డ్రైవర్, కండక్టర్‌తో పాటు మరో 13 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కర్ణాటకలోని బీదర్ మార్కెట్ పోలీసుల కథనం ప్రకారం.. బీదర్-2 ఆర్టీసీ డిపోకు చెందిన కేఏ 38ఎఫ్1203 నంబర్ బస్సు మంగళవారం బీదర్ నుం చి హైదరాబాద్‌కు బయలుదేరింది. కర్ణాటక- తెలంగాణ సరిహద్దులోని శంశోల్లాపూర్ గ్రామ శివారులో న్యాల్కల్ మండలం మిర్జాపూర్(బీ) గ్రామానికి చెందిన పంచలింగాల నర్సింలు(48), అతని తమ్ముడు నాగన్న కుమారుడు అరుణ్‌కుమార్(22)తో కలి సి బీదర్‌లో బంధువుల వివాహానికి వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొట్టి కొంత దూరం దూసుకెళ్లి రోడ్డు పక్కన బోల్తాపడింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న నర్సింలు, అతని తమ్ముడు కుమారుడు అరుణ్‌కుమార్ అక్కడిక్కడే మృతిచెందారు.
బస్సు డ్రైవర్ శ్రీమంత్, కండక్టర్ రవి, మరో 13 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో జహీరాబాద్-బీదర్ ప్రధాన రోడ్డుపై ట్రాఫిక్ జామ్‌తో వాహనచోదకులు, ప్రయాణికులు ఇబ్బందులకు గుర య్యా రు. బీదర్ మార్కెట్ పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్ల్లియర్ చేశారు. క్షతగాత్రులను వైద్య పరీక్షల కోసం బీదర్‌లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బీదర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు బీదర్ పట్టణ మార్కెట్ పోలీసులు తెలిపారు. బీదర్-2 ఆర్టీసీ డిపో అధికారులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు.