హైదరాబాద్, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ): అమెరికాతో కేంద్ర ప్రభుత్వం చేసుకోబోతున్న వాణిజ్య ఒప్పందం కారణంగానే రాష్ట్రంలో పంటల ధరలు పతనమైన ట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. ఈ ఒప్పందం పూర్తయి కార్యరూపం దాల్చితే ధరలు మ రింత పతనమవుతాయని చెప్పారు. సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.
అమెరికాతో ఒప్పందానికి సంబంధించి బయటికి వస్తున్న విషయాల ప్రభావం ఇప్పటికే మారెట్లో కనిపించడం ప్రారంభమైందని తెలిపారు. మకజొన్న ధరలు సుమారు 30% వరకు పడిపోవడం, సో యాబీన్, పత్తి ధరలు 20% వరకు తగ్గడం వంటి పరిణామాలు రైతులకు ముందస్తు హెచ్చరికగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే అమెరికా నుంచి డీడీజీఎస్(పశువుల ఆహారం), సోయా ఆయిల్ దిగుమతులు పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల దేశీయంగా సోయాబీన్‌కు డిమాం డ్ తగ్గుతుందని, మకజొన్న వినియోగం పడిపోతుందని అంచనా వేశారు. మకజొన్న విషయంలో కేంద్రం కొనుగోలు బాధ్యతను నిర్వర్తించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని తెలిపారు. సోయాబీన్, శనగలు, పెసర్లు వంటి పంటల కొనుగోలులో కూడా పరిమితులు విధించడం ఆ భారం రాష్ట్రాలపై పడుతున్నదని వివరించారు.