Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
Farmers Protest | విద్యుత్ కోతల వల్ల పంట పొలాలు ఎండిపోతున్నాయని ఊర్కొండపేట, జాకినాలపల్లి రైతులు జాకినాలపల్లి - సబ్ స్టేషన్ వద్ద వంటవార్పుతో నిరసన తెలిపారు.
జడ్చర్ల : విద్యుత్ కోతల ( Power cuts ) వల్ల పంట పొలాలు ఎండిపోతున్నాయని నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలానికి చెందిన ఊర్కొండపేట, జాకినాలపల్లి రైతులు ఆదివారం జాకినాలపల్లి – సబ్ స్టేషన్ వద్ద వంటవార్పు ( Vanta Varpu ) తో నిరసన తెలిపారు. ఊర్కొండపేట మాజీ సర్పంచ్ కృష్ణ గౌడ్ , రైతులు మాట్లాడుతూ సాగు కోసం అప్పులు చేసి, పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు.
అన్నదాతలకుపొలాలకు నీరు పెట్టాల్సిన సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాల తో ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రెక్కలు ముక్కలు చేసుకుని పంట పండించే రైతన్నకు కనీసం సక్రమంగా విద్యుత్ సరఫరా కూడా అందడం లేదని పేర్కొన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్, సాగునీరు అందించడం ప్రభుత్వాల బాధ్యతని గుర్తు చేశారు. విద్యుత్ కోతలను నివారించి, నిరంతర విద్యుత్ సరఫరా అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రైతులు రామాంజనేయులు, సూక్కపురం అంజయ్య, శ్రీధర్ రెడ్డి, కటమోని జంగయ్య, ఆలకుంట మల్లేష్, కప్పర చంద్రయ్య, సురేందర్,సాయి రెడ్డి, మోటపురం యాదయ్య, బాల్‌రాజ్ , సిరిగిరి జంగయ్య, జల్లయ్య, పోలే కృష్ణయ్య పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

