Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assaulting CJP Protesters | దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల సందర్భంగా హిందూ రక్షా దళ్‌కు చెందిన వ్యక్తులు చెలరేగిపోయారు. యువతీ, యువకులపై వారు దాడికి పాల్పడ్డారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల సందర్భంగా హిందూ రక్షా దళ్‌కు చెందిన వ్యక్తులు చెలరేగిపోయారు. యువతీ, యువకులపై వారు దాడికి పాల్పడ్డారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. (Assaulting CJP Protesters) శనివారం జంతర్‌మంతర్ వద్ద సీజేపీ తలపెట్టిన నిరసనలో పాల్గొనేందుకు వెళ్తున్న యువతీ, యువకులపై నలుగురు వ్యక్తులు దాడి చేశారు. హిందూ రక్షా దళ్ సభ్యులమని చెప్పుకున్న వారు, కమలా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీడీయూ మార్గ్‌లోని ఒక ప్రాంతంలో యువ విద్యార్థులను కొట్టారు. ఒక మహిళను నేలకు నెట్టి అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆ సమయంలో ఒక పోలీస్ సిబ్బంది కూడా అక్కడ ఉన్నారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఎలాంటి ఫిర్యాదు అందనప్పటికీ ఆ నలుగురు వ్యక్తులను గుర్తించారు. నిందితులైన రమణ్ సైని, వివేకానంద్ అలియాస్ వివేక్, కపిల్ కుమార్, రవీందర్ సింగ్ అలియాస్ గోవింద్ హిందూను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు.
DEEPLY DISTURBING!
BJP-RSS goons beating a young girl in the presence of Delhi Police, with an officer seemingly guiding them to stop the recording.
Why is Delhi Police helping goons attack peaceful protestors instead of protecting them? Who gave them this free hand? https://t.co/2JeT40wrx2
— Cockroach Janta Party – CJP (@Cockroachisback) October 10, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- arrested
- assaulting
- CJP
- Delhi
RELATED ARTICLES
తాజా వార్తలు
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

