Farmers protest | రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై ధాన్యం పోసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ఎదుట రైతుల నిరసన చేపట్టారు. రోడ్డుపై వడ్ల బస్తాలు తగలబెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మార్కెట్ కు ధాన్యం తరలించి రోజులు గుడుస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వెంటనే కొను గోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున నిరసన చేపడుతామని హెచ్చరించారు.