యూత్ కమిషన్ కోసం ప్రైవేట్ మెంబర్ బిల్లు
జెన్ జీ నిరసనలు, విద్యార్థులు, విపక్షాలతో అధికార పక్షానికి మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ ఎన్డీయే మిత్రపక్షం ఎల్జేపీ యువత కోసం శాశ్వతంగా జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని లోక్సభలో శుక్రవారం ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టింది.
న్యూఢిల్లీ : జెన్ జీ నిరసనలు, విద్యార్థులు, విపక్షాలతో అధికార పక్షానికి మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ ఎన్డీయే మిత్రపక్షం ఎల్జేపీ యువత కోసం శాశ్వతంగా జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని లోక్సభలో శుక్రవారం ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టింది.
అయితే మధ్యాహ్నం ఈ బిల్లుపై ఈ చర్చ జరగాల్సి ఉండగా, అంతకు ముందే సభ వాయిదా పడింది. యువతలో నిరుద్యోగం వంటి క్లిష్లమైన సమస్యలను తగ్గించేలా నైపుణ్యాభివృద్ధి, ఆంత్రప్రెన్యూర్షిప్, వ్యాపార ఆలోచనల అభివృద్ధి, యువ సృజనకారులకు ప్రత్యేక ఆర్థిక పెట్టుబడి సాయం లాంటి అంశాలపై నిర్మాణాత్మక జాతీయ విధానాలను రూపొందించే నోడల్ ఏజెన్సీలా యూత్ కమిషన్ను తీర్చిదిద్దాలని బిల్లులో ప్రతిపాదించారు.
ముస్లింలలో బహుభార్యత్వంపై సుప్రీంలో పిటిషన్!
న్యూఢిల్లీ, జూలై 31: ముస్లింలలో బహుభార్యత్వం ఆచరణ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తున్నందున దానిని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రం నుంచి స్పందనను కోరింది. మహిళా హక్కుల కార్యకర్తలు జకియా సోమన్, నూర్జహాన్ సఫియా, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్మాల్య బాగ్చి, వీ మోహనలతో కూడిన ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీచేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

