మల్కాజిగిరి, జూలై 31 : బీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
వినాయక్‌నగర్ డివిజన్ వాజ్‌పేయినగర్‌కు చెందిన పలువురు బీజేపీ నాయకులు జక్కుల కిరణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జేఏసీ వెంకన్న, జక్కుల కిరణ్, శ్రీకాంత్, శ్రీధర్, విజయ్‌రెడ్డి, సురేష్, తదితరులు పాల్గొన్నారు.