ఆదిలాబాద్ : యాసంగిలో పండించిన జొన్న పంటలు ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పంట కొనుగోలులో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారం రోజులు కిందట జొన్నలను మార్కెట్ యార్డ్ కు తీసుకురాగా పంట కొనుగోలు చేయడం లేదన్నారు.
సంచులు లేవని కారణం చెబుతున్నారని, గన్నీబ్యాగులు కొనుగోలు చేసుకొని వచ్చిన రైతులకు పంటను కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పడం సరికాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్క్ ఫెడ్ అధికారులు పంట కొనుగోలులో నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించి నష్టపోవాల్సి వస్తుందని అన్నారు.