మరికల్ : వరి సాగులో చేపల పెంపకంపై ( Fish farming ) రాంకీ ఫౌండేషన్, సూర్యచంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆక్వా రైతులకు ( Aqua Farmers ) అవగాహన కల్పించారు. వరి పంటను సాగు చేస్తూ ఎనిమిది గంటల భూమిలో కొర్రమీను సాగు చేసే విధానంపై రైతులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. ఒక్క యూనిట్ ధర రూ.4.5 లక్షలు పెట్టుబడితో కొర్రమీను సాగు చేయవచ్చని, పీఎంఈజీవై ( PMGY ) పథకం ద్వారా రైతులకు 35 శాతం సబ్సిడీ వర్తిస్తుందని బ్యాంకు మేనేజర్లు ( Bank Mangers ) వివరించారు .
చేపల పెంపకం ద్వారా ఆదాయంతో పాటు వరి పంటకు నత్రజని కాల్షియం అందడంతో భూమి సారవంతంగా మారుతుందని పేర్కొన్నారు. మహిళా సంఘాలు, రైతులు చేపల పెంపకం పై ఆసక్తి ఉంటే వెంటనే చేపల పెంపకం యూనిట్లకు బ్యాంక్ అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రెహమాన్, రాంకీ ఫౌండేషన్ అధికారి మహేందర్, సూర్యచంద్ర ఫౌండేషన్ చైర్మన్ సూర్య మోహన్ రెడ్డి,చంద్రమోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరన్న, రైతులు పాల్గొన్నారు.