నాసిక్: బీజేపీ పాలిత మహారాష్ట్రలోని రైతులు తమ కష్టాలను పట్టించుకోని ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఇటీవల కొండచరియల విరిగిపడి, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగినప్పుడు ప్రభుత్వం ఎంతటి శ్రద్ధ చూపిందో, అదే విధమైన శ్రద్ధ వర్షాల కారణంగా పంట నష్ట పోయిన రైతులపైనా చూపాలని శనివారం ఉల్లి రైతుల సంఘం అధ్యక్షుడు భరత్ డిమాండ్ చేశారు.
మహారాష్ట్ర అభివృద్ధికి అటు నగరాలు, ఇటు గ్రామాలు రెండూ సమానమేనని, పట్టణాల ఇబ్బందులతో పాటు రైతుల కష్టాలను కూడా ఆలకించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని భరత్ పేర్కొన్నారు.