న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను చట్టం 1961 కింద గుర్తింపు పొంది, ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) చట్టం కింద అధికారిక మినహాయింపు లభించని ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టుల క్రమద్ధీకరణకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) ‘ఆమ్నెస్టీ-2026’ పేరిట ఒకేసారి వర్తించే ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం 2026 జూన్ 29 నుంచి 2026 డిసెంబర్ 28 వరకు అందుబాటులో ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే సంస్థలకు గత కాలం(రెట్రో స్పెక్టివ్)నుంచి మినహాయింపు వర్తింపజేస్తారు. దీనికోసం ప్రతి ప్రాంతీయ కార్యాలయంలో నోడల్ ఆఫీసర్‌ను, ‘అమ్నెస్టీ-2026’ సెల్‌ను హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయనున్నారు.