న్యూఢిల్లీ : మనం ఇంటర్నెట్ అవసరం లేకపోయినా డాటాతో కూడిన మొబైల్ రీఛార్జ్ ప్లాన్లు వేసుకుంటున్నాం. వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ ప్లాన్లను టెలికం కంపెనీలు తక్కువ కాల పరిమితితో అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వినియోగదారుల హక్కులను కాపాడేందుకు ముసాయిదా 2026ను తీసుకొచ్చింది.
కొత్త ముసాయిదా ప్రకారం.. అవసరం లేకపోయినా డాటా ఎందుకు అనేది ఇందులో కీలక అంశం. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రస్తుతం 7, 28, 56, 84 రోజుల డేటా, వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లతో కూడిన ప్లాన్లు అందిస్తున్న టెలికం కపెనీలు.. ఇక నుంచి అదే కాల వ్యవధితో కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లతో కూడిన ప్లాన్లు అందించాలని ముసాయిదా చెబుతోంది. దీంతో డాటా వాడని వా రు, వాయిస్ కాల్స్ కోసమే రెండో సిమ్ వాడేవారికి, డాటా ఎక్కువగా వినియోగించని వారికి ఈ నిబంధనలు ఉపయోగపడుతాయి. దీంతో ప్రస్తుత రీఛార్జ్ ప్లాన్ల లో డాటా లేకపోతే 50 శాతం నుంచి 70 శాతం తక్కువ ధరకే లభిస్తాయి.