విద్యార్థిని శిక్షించడం ఆత్మహత్యకు ప్రేరేపణ కాదు.. బాంబే హైకోర్టు కీలక తీర్పు
చదువు కోసం విద్యార్థిని ఉపాధ్యాయుడు శిక్షిస్తే, అది ఆ విద్యార్థిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు కాదని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ వ్యాఖ్యానించింది. బుల్దానాకు చెందిన ఒక కేసులో జస్టిస్ మహేంద్ర చంద్వాని ఇటీవల తీర్పునిస్తూ, సదరు ఉపాధ్యాయునిపై నమోదైన క్రిమినల్ కేసును చట్టవిరుద్ధమని పేర్కొంటూ కొట్టివేశారు.
ముంబై,జూలై 11 (నమస్తే తెలంగాణ): చదువు కోసం విద్యార్థిని ఉపాధ్యాయుడు శిక్షిస్తే, అది ఆ విద్యార్థిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు కాదని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ వ్యాఖ్యానించింది. బుల్దానాకు చెందిన ఒక కేసులో జస్టిస్ మహేంద్ర చంద్వాని ఇటీవల తీర్పునిస్తూ, సదరు ఉపాధ్యాయునిపై నమోదైన క్రిమినల్ కేసును చట్టవిరుద్ధమని పేర్కొంటూ కొట్టివేశారు. నిరుడు బుల్దానా జిల్లాలోని వాసదికి చెందిన ఉపాధ్యాయుడు గోపాల్ సూర్యవంశీ తరగతి గదిలో వివేక్ అనే విద్యార్థిపై చదువు విషయమై కోప్పడి, 100 గుంజీలు తీయాలని శిక్షించారు.
25 గుంజీలు తీశాక వివేక్ మరి తీయలేనని చెప్పాడు. దీంతో ఉపాధ్యాయుడు మందలించారు. మనస్తాపానికి గురైన వివేక్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్య లేఖ ఆధారంగా పోలీసులు ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన రోజు ఉపాధ్యాయుని మాటలు కఠినమైనవి అయినప్పటికీ, అతడి చదువు కోస మే ఆ మాటలు అన్నారని, దాని లో నేరపూరిత ఉద్దేశం లేదని కోర్టు పేరొంది. మృతి చెందిన బాలుడు సున్నిత మనసుడు కావడం వల్లే క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడని కోర్టు తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

