మహబూబ్ నగర్ కలెక్టరేట్ : వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలుకు ( Grain Purchase ) సంబంధించి ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టం (OPMS) లో రైతుల వివరాలు వెంటనే నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి (Collector Vijayendira Boi) కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. గురువారం మహబూబ్నగర్ రూరల్ మండలం కోటకద్ర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా అప్పాయపల్లి వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ ( Sudden Visit ) చేశారు.
ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్ల వివరాలు తెలుసుకున్నారు. సరైన తేమ శాతం, నాణ్యత ప్రమాణాలతో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ట్యాగ్ చేసిన మిల్లుకు పంపించాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు. కొనుగోలు చేసిన వెంటనే రైతుకు కొనుగోలు వివరాలతో కూడిన కొనుగోలు పత్రం అందజేయాలని అన్నారు.
కొనుగోలు తర్వాత మిల్లుకు పంపే వరకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పూర్తి బాధ్యత వహించాలన్నారు. కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడారు. కొనుగోలు చేసిన ధాన్యం మిల్లు కు రవాణా చేయుటకు అవసరమైన లారీలు ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా సహకార అధికారి శంకరాచారి, సహకార ఆడిట్ అధికారి టైటస్ పాల్, మహబూబ్ నగర్ రూరల్ తహశీల్దార్ సుందరా చారి, తదితరులు ఉన్నారు.