‘ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి’
ఎల్‌నినో ప్రభావాల నేపథ్యంలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని కొండమల్లేపల్లి మండల వ్యవసాయ అధికారి జానకిరాములు సూచించారు. కొండమల్లేపల్లి రైతు వేదికలో వ్యవసాయ విస్తరణ అధికారులు...
కొండమల్లేపల్లి, అక్టోబర్ 27 : ఎల్‌నినో ప్రభావాల నేపథ్యంలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని కొండమల్లేపల్లి మండల వ్యవసాయ అధికారి జానకిరాములు సూచించారు. కొండమల్లేపల్లి రైతు వేదికలో వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులతో మంగళవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు వరి సాగు చేయకుండా, నువ్వులు, ఉలవలు, మినుములు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. తక్కువ నీటితో సాగు చేయగల పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని, వర్షపాతం పరిస్థితులు, భూమి స్వభావం, నీటి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకునేలా చూడాలన్నారు. పంటల మార్పిడి ద్వారా వాతావరణ ప్రతికూలతలను ఎదుర్కొనేలా రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని జానకిరాములు పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి’
నల్లగొండ మండలంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
Arnab Cyclone | విశాఖలో మొదలైన అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. వీడియో
వసతి గృహాల్లో పరిశుభ్రతను పాటించాలి : ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ చందన
అక్రమ విద్యుత్ కనెక్షన్‌తో అటవీ జంతువులకు ఉచ్చు.. నలుగురిపై కేసు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

