అక్రమ విద్యుత్ కనెక్షన్‌తో అటవీ జంతువులకు ఉచ్చు.. నలుగురిపై కేసు
అటవీ జంతువుల వేట కోసం అక్రమంగా విద్యుత్ వైర్లు ఏర్పాటు చేసిన ఘటనలో మంగళవారం నలుగురిపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. అక్టోబర్ 24న రాత్రి 7.30 గంటల సమయంలో విద్యుత్ సరఫరా పదేపదే ట్రిప్ అవుతుండడంతో విద్యుత్ శాఖ సిబ్బంది...
కారేపల్లి, అక్టోబర్ 27 : అటవీ జంతువుల వేట కోసం అక్రమంగా విద్యుత్ వైర్లు ఏర్పాటు చేసిన ఘటనలో మంగళవారం నలుగురిపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. అక్టోబర్ 24న రాత్రి 7.30 గంటల సమయంలో విద్యుత్ సరఫరా పదేపదే ట్రిప్ అవుతుండడంతో విద్యుత్ శాఖ సిబ్బంది సహకారంతో అటవీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అప్పాయిగూడెం పరిసర ప్రాంతంలోని పాలిక కోటయ్యకు చెందిన పామ్ ఆయిల్ తోటలో అటవీ జంతువుల కోసం ఏర్పాటు చేసిన అక్రమ విద్యుత్ వైర్లను గుర్తించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు పబ్బుల రాములు, భూక్యా రఘు, రెడ్డిబోయిన వెంకన్న, ఎల్లిబోయిన నాగేశ్వరరావుపై కేసు నమోదు చేశారు. వీరు మాదారం, పరిసర గ్రామాలకు చెందినవారిగా గుర్తించి కోర్టులో హాజరు పరిచారు. అటవీ జంతువుల సంరక్షణకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలకు పాల్పడడం చట్టరీత్యా నేరమని, అటవీ ప్రాంతాల్లో అక్రమ విద్యుత్ వైర్లు ఏర్పాటు చేయడం వల్ల వన్యప్రాణులతో పాటు మనుషుల ప్రాణాలకూ ప్రమాదం పొంచి ఉంటుందని అధికారులు హెచ్చరించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అక్రమ విద్యుత్ కనెక్షన్‌తో అటవీ జంతువులకు ఉచ్చు.. నలుగురిపై కేసు
Jio Platforms | జియో ప్లాట్‌ఫామ్స్ లిస్టింగ్.. కీలకమైన అంశాలు ఇవే..!
ఈ-వ్యర్థాలపై విద్యార్థులకు అవగాహన
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పట్టభద్రుల ఓటరు నమోదు
Harish Rao | రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడికే అపాయింట్మెంట్ లేదు.. ఇదెక్కడి ప్రజాపాలన..? : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

