వసతి గృహాల్లో పరిశుభ్రతను పాటించాలి : ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ చందన
బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఉప్పుసాక గ్రామంలో గిరిజన ఆశ్రమ పాఠశాలను ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ చందన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించి...
– ఉప్పుసాక గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల ఆకస్మిక తనిఖీ
బూర్గంపహాడ్, అక్టోబర్ 27 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఉప్పుసాక గ్రామంలో గిరిజన ఆశ్రమ పాఠశాలను ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ చందన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించి ప్రశ్నలు అడిగి సరైన సమాధానాలు చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల టైంటేబుల్, ఉపాధ్యాయుల డైరీలు, కంప్యూటర్ ల్యాబ్‌ను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు నిరంతరం సరైన శిక్షణ అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. హెచ్ఎం పిచ్చయ్యను పాఠశాలకు సంబంధించి పలు అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌ను సందర్శించి స్టోర్ రూమ్‌ను పరిశీలించారు. వసతి గృహాల్లో పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ఆమె వెంట ఐటీడీఏ ఏటీడీవో రాధ, హెచ్ఎం పిచ్చయ్య, సీనియర్ ఉపాధ్యాయులు బీమా, ప్రసాదరావు, రాజేష్, భద్రు, రాములు, విజయ, విజయ, వార్డెన్ రాములు, రవి, వెంకట్, ధర్మరాజు, నర్సింహారావు, కిషన్, రమేష్, గోవింద్‌లు ఉన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

