కడెం, సెప్టెంబర్ 6 : నిర్మల్ జిల్లా కడెం మండలం మాసాయిపేటకు చెందిన రైతు ముంజ తిరుపతిగౌడ్ యూరియా కోసం ఎదురొంటున్న ఇబ్బందులను బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. ఆదివారం కాంగ్రెస్ 1,000 రోజుల పాలనపై నిరనలు కొనసాగాయి. ఇందులో భాగంగా జాన్సన్ నాయక్ మాసాయిపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా యూరియా కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సదరు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశానంటూ తిరుపతిగౌడ్ భావోద్వేగానికి గురై చెప్పుతో కొట్టుకుని నిరసన తెలిపాడు.